ఇక స్మార్ట్గా జమ్మూ సర్కార్

1 Mar, 2015 18:30 IST|Sakshi
ఇక స్మార్ట్గా జమ్మూ సర్కార్

జమ్మూకశ్మీర్లో ఆదివారం కొలువు దీరిన బీజేపీ, పీడీపీ భాగస్వామ్య ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యచరణను ప్రకటించింది.  దీనిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఫ్తీ మహ్మద్ సయీద్(79) ఆదివారం ప్రకటించారు. ఇందులోని ప్రధానాంశాలివే

  • రాజకీయ, ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు రాష్ట్రంలో శాంతియుత, సుస్థిరతతో కూడిన వాతావరణాన్నికల్పించడం.
  • ప్రభుత్వాన్ని పూర్తిగా స్మార్ట్ గవర్నమెంట్గా మార్చడం.
  • ప్రస్తుతం రాష్ట్రంలోని అవినీతి సమూలంగా నిర్మూలించి పూర్తిగా అవినీతిరహిత రాష్ట్రంగా రూపొందించడం.
  • రాష్ట్రంలోని వనరులు, నైపుణ్యాలకు అనుగుణంగానే ఆర్థిక విధానాలు తయారుచేయడం.
  • ముందే గుర్తించబడిన సంస్థలు స్వయం ప్రతిపత్తితో కొనసాగే వెసులుబాటును కల్పించడం. వాటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం.
  • ఉద్రిక్త పూరిత ప్రాంతాల్లో ప్రత్యేక సాయుధ దళాల అధికార చట్టాన్ని ఉపయోగించాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించడం.
  • పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం నుంచి నిరాశ్రయులుగా వచ్చినవారికి ఏక కాలంలో పరిష్కారం సూచించడం.
  • సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న పౌరులకు మరిన్ని ప్రోత్సహకాలు కల్పించడంవంటి పలు అంశాలను పేర్కొన్నారు. అలాగే, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన 370 ఆర్టికల్ జోలికి వెళ్లకుండా యథా స్థితిని కొనసాగించాలని భావిస్తోంది.    

 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా