లైవ్‌ కవరేజీ... భలే క్రేజీ

6 Jan, 2017 16:11 IST|Sakshi
లైవ్‌ కవరేజీ... భలే క్రేజీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన రోజున కేంద్ర ప్రసార, సమాచార శాఖ(ఎంఐబీ) ట్విటర్‌ పేజీకి భారీగా వ్యూస్‌ వచ్చాయి. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఈ నెల 4న ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసీకి ట్విటర్‌ పేజీ లేకపోవడంతో ఈ ప్రకటనను ఎంఐబీ తన ట్విటర్‌ పేజీలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటనకు 55,127 వ్యూస్‌ వచ్చాయి. 1,448 సార్లు రీట్వీట్‌ గా, 550 లైకులు వచ్చినట్టు ఎంఐబీ వెల్లడించింది. 

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా ఉన్నతాధికారులు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని యూట్యూబ్ లో చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని 1,700 మంది వీక్షించారని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ పై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) చేసిన ట్వీట్లకు భారీ స్పందన వచ్చింది. 6.5 లక్షల వ్యూస్‌, 951 లైకులు వచ్చాయి. 4,410 సార్లు రీట్వీట్‌ చేశారు. పీఐబీ పేస్‌ బుక్‌ పేజీలో ప్రత్యక్ష ప్రసారాన్ని 3.04 లక్షల మంది వీక్షించారు. జాతీయ ఎన్నికల సంఘం(ఈసీఐ) ఫేస్‌ బుక్‌ పేజీలో విలేకరుల సమావేశం లైవ్‌ ప్రసారానికి 6,400 లైకులు రాగా, 624 మంది షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు