‘అలా అయితే నా రాజకీయ జీవితం ముగిసినట్టే’

23 Jul, 2020 13:11 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయాలు రోజురోజుకు ముదిరి న్యాయస్థానం మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరు అంశాన్ని తీవ్రంగా భావించిన ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ దానికి గల కారణాలను వెంటనే తమ ముందుంచాలని ఆదేశించారు. దీంతో సచిన్‌ పైలట్‌తో సహా సమావేశానికి హాజరుకానీ 19 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా వారిపై అనర్హత వేటును వేస్తూ నోటీసులు పంపింది.   

చదవండి: ‘మీ పోరాటాన్ని యావత్‌ భారత్‌ గమనిస్తోంది’

అనర్హత నోటీసులపై సచిన్‌ పైలట్‌ వర్గం రాజస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించింది. తమకు‌ జారీచేసిన నోటీసులను సవాలు చేస్తూ 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీని గురించి సచిన్‌ పైలట్‌ ...‘ఒక వేళ తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే నా రాజకీయ జీవితం ఇంకా ముగిసినట్లే అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు’ తెలుస్తోంది. ఒకవేళ తనకు అనుకూలంగా తీర్పు వస్తే తన హక్కుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీతో పోరాడతానని చెప్పినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాము శాసన సభలో పార్టీని వ్యతిరేకించలేదని, తమకు భిన్న అభిప్రాయాలు ఉండటం వల్ల పార్టీ సమావేశానికి హాజరు కాలేదని సచిన్‌ వర్గీయులు తెలిపారు. ఇది యాంటీ డిఫెక్షన్‌ కిందకు రాదని వారంటున్నారు. ఆశోక్‌ గెహ్లాట్‌ నాయకత్వాన్ని సచిన్‌ పైలట్‌ వర్గీయులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. రాజస్థాన్‌ హైకోర్టు విచారణపై స్టే విధించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. 19 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.   చదవండి: పైలట్‌పై గహ్లోత్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా