మార్చి నెలకు ఆరు కోట్ల కేసులు..!

16 Jul, 2020 10:39 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్​లో ఆరు కోట్ల మందికి కరోనా వైరస్​ సోకే అవకాశం ఉందని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ సైన్సెస్​(ఐఐఎస్సీ) వెల్లడించింది. అదే ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యను 37.4 లక్షలకే పరిమితం చేయొచ్చని పేర్కొంది.మార్చి 23 నుంచి జూన్​ 18 వరకూ దేశంలో కోవిడ్​–19 విస్తృతి ఆధారంగా ఓ మెథమెటికల్​ మోడల్​ను ఐఐఎస్​సీ అభివృద్ధి చేసింది. దీని ఆధారంగా వచ్చే మార్చి వరకూ దేశంలో కోవిడ్​ ఉధృతి తారస్థాయికి చేరుకోదు(అంటే ఆరు కోట్ల కేసులు నమోదు కావొచ్చు). అదే తక్కువ కేసులు నమోదైతే ఈ ఏడాది సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లోనే కోవిడ్​ తారస్థాయికి చేరుకుంటుంది. (అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్‌ కిట్)

వారంలో రెండ్రోజులు లాక్​డౌన్​
దేశంలో వారంలో రెండు రోజుల పాటు లాక్​డౌన్​ను పాటించడం, మిగతా రోజుల్లో మనిషికి మనిషి మధ్య దూరం ఉండేలా చూసుకోవడం వల్ల కొత్త కేసుల నమోదు తీవ్రతను గణనీయంగా తగ్గించొచ్చని ఐఐఎస్​సీ పేర్కొంది. దేశంలో కోవిడ్​ రికవరి రేటు పెరగడం వెనుక మెడికల్​ కేర్​, క్వారంటైన్​ పాత్ర ప్రముఖంగా ఉందని వెల్లడించింది.(‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’)

>
మరిన్ని వార్తలు