సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు

16 Jul, 2020 10:47 IST|Sakshi

మనిషికి మానవత్వానికి విడదీయరాని బంధం ఉంది. అయితే ప్రస్తుతం మనిషి, మనిషికి మధ్య బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా మానవత్వం సన్నగిల్లుతోంది. కానీ మనిషిలోని మంచితనం ఇంకా బతికి ఉందనేందుకు ఈ సంఘటన అద్దంపడుతోంది. అయితే అతడేం ధనవంతుడు కాదు. అయినప్పటికీ తనకున్న దానిలో సాయం చేసి తన దయా గుణాన్ని చాటుకున్నాడు. (అమ్మాయ్‌.. ఎన్ని మార్కులొచ్చాయ్‌?)

భారత అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా తన ట్విటర్‌ ఖాతాలో ఓ సందేశాత్మక వీడియోను పోస్టు చేశారు. 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వృద్ధుడైన ఓ బిచ్చగాడు తింటుండగా.. వీధి కుక్కలు అతని చుట్టూ వచ్చి చేరాయి. దీంతో ఆ వృద్ధుడు తింటున్న ఆహారాన్ని రెండు ప్లేట్లలో వేసి కుక్కలకు తినిపించాడు. ‘సంపదలో పేదవాడు. మనసున్న వ్యక్తిలో ధనవంతుడు’ అని  షేర్‌ చేసిన ఈ వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అంతేగాక వృద్ధుడు దయతో చేసిన మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఈ రోజుల్లో  మానవ్వతం తగ్గిపోతుంది. ఈ వృద్ధుడు మనిషిలోని మానవత్వాన్ని చాటుకున్నాడు’. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. (సూపర్‌ హిట్‌ సాంగ్‌కు డాన్స్‌ చేసిన వార్నర్‌ కూతుళ్లు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా