అగ్ని-5 క్షిపణీ పరీక్ష విజయవంతం

3 Jun, 2018 12:46 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : రక్షణ రంగంలో భారతదేశం అతి పెద్ద విజయం సాధించింది. అగ్ని-5 క్షిపణీ పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి ఆదివారం డీఆర్‌డీఓ పరీక్షించింది. ఈ క్షిపణీని నాల్గోపాడ్‌ నుంచి ఉదయం 09.50కి ప్రయోగించారు. ఈ సంత్సరంలో ఆరుసార్లు విజయవంతంగా పరీక్షించారు. చివరగా ఈ సంవత్సరంలో జనవరి 18వ తేదీన ప్రయోగించినట్లు తెలుస్తోంది.

5వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా అగ్ని-5 క్షిపణీ ఛేదించగలదు. ఈ విజయంతో అమెరికా, చైనా, రష్యా సరసన భారత్‌ చేరింది. ఈ క్షిపణీ దాదాపుగా చైనాను కూడా కవర్‌ చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజస్తాన్‌లోని థార్‌ ఎడారిలో మే11, 1998లో పొఖ్రాన్‌ న్యూక్లియర్‌ పరీక్షలు జరిగాయి. మే11, 2018 నాటికి న్యూక్లియర్‌ పరీక్ష జరిగి 20 సంవత్సరాలు పూర్తి అయింది. 1998 మే 11 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌ ప్రాంతంలో భారత్‌ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. 

మరిన్ని వార్తలు