తూత్తుకుడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 3 2018 12:53 PM

NHRC Starts Probe Into Thoothukudi Firing Issue - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు తూత్తుకుడి స్టెరిలైట్‌ పరిశ్రమ వివాదంతో చెలరేగిన హింసలో 13 మంది మృతి చెందటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) విచారణ చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్‌ సభ్యులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు.

హింసకు దారితీసిన పరిస్థితులు, కాల్పులు జరపమని ఆదేశించిన అధికారులెవరు? హింస చెలరేగడంలో నిరసనకారుల, పర్యావరణ కార్యక​ర్తల పాత్ర ఏమిటనే కోణంలో కలెక్టర్‌ సందీప్‌ నండూరిని అడిగి వివరాలు సేకరించారు. పుపుల్‌ దత్త ప్రసాద్‌ నేతృత్వంలో కొనసాగిన ఈ విచారణలో కమిషన్‌ సభ్యులు రాజీవర్‌ సింగ్‌, నితిన్‌ కుమార్‌, అరుణ్‌ త్యాగి, లాల్‌ బకర్‌ పాల్గొన్నారు. రెండ్రోజుల విచారణ అనంతరం ప్రత్యేక నివేదిక రూపొందిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement