‘కరోనా’ పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

3 Feb, 2020 14:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందడం‍తో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేసింది. చైనాలోని భారత విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా కరోనా వైరస్‌పై మంత్రుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర హోంశాఖ సహాయకమంత్రి కిషన్‌రెడ్డితో పాటు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి, పౌరవిమానయానశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌పోర్స్‌ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. 

(చదవండి : భారత్‌లో మూడో ‘కరోనా’ కేసు)

కాగా, కేరళలో సోమవారం మరో కరోనా కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు.ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ వల్ల ఇప్పటికే చైనాలో 300 మందికి పైగా మృతి చెందారు. అలాగే 15 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది.

మరిన్ని వార్తలు