ఢిల్లీలో అమల్లోకి డీజిల్ క్యాబ్‌ల నిషేధం

2 May, 2016 01:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో డీజిల్ క్యాబ్‌లపై ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి రావడంతో  27 వేల వాహనాలు రోడ్డెక్కలేదు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదివారం కావడంతో నిషేధం వల్ల ప్రజా రవాణాకు పెద్ద ఇబ్బంది లేకపోయినా... నేటి నుంచి క్యాబ్‌ల కొరత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు ఇదే అదనుగా ఉబర్ క్యాబ్స్ చార్జీల్ని ఒక్కసారిగా పెంచేసింది. డీజిల్‌తో నడిచే క్యాబ్‌లను సీఎన్‌జీకి మార్చేందుకు గడువు పెంచాలన్న విజ్ఞప్తిని శనివారం సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో 2 వేల ట్యాక్సీల్ని డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చారు.

మరిన్ని వార్తలు