సిస్టర్‌ మరియాను ‘బ్లెస్డ్‌’గా ప్రకటించిన వాటికన్‌

5 Nov, 2017 03:37 IST|Sakshi

భోపాల్‌/ఇండోర్‌ : కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని రాణి మరియా వట్టాలిని వాటికన్‌లో రోమన్‌ కేథలిక్‌ చర్చి దీవెన పొందిన(బ్లెస్డ్‌) వ్యక్తిగా ప్రకటించింది. ఇండోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ నుంచి వచ్చిన ప్రకటనను కార్డినల్‌ ఏంజెలో అమాటో చదివి వినిపించారు. పునీత(సెయింట్‌హుడ్‌)కు ముందు హోదానే బ్లెస్డ్‌.. ఈ కార్యక్రమంలో మరియాను కత్తితో పొడిచి చంపిన హంతకుడు కూడా పాల్గొనడం గమనార్హం. సిస్టర్‌ రాణిగా పేరుపడ్డ మరియా 1995లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. దేవాస్‌ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తుండగా హంతకుడు ఆమెను 50 సార్లు పొడిచి హత్య చేశాడు.   

మరిన్ని వార్తలు