లోక్‌సభ సోమవారానికి వాయిదా

14 Aug, 2013 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ: విపక్షాల ఆరోపణల నడుమ బుధవారం ఆరంభమైన లోక్‌సభలో చర్చలు గందరగోళానికి తావివ్వడంతో సభను సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. లోక్‌సభలో విపక్షాలు తిరిగి గందరగోళ సృష్టించడంతో సభ  వాయిదా వేశారు. ఈ రోజు గుర్ఱాలాండ్  అంశం ప్రధానంగా  చర్చకు దారి తీసింది.
 
కొందరు ఎంపీలు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వలేదు. బీజేపీ సభ్యుడు జశ్వంత్ సింగ్ మాత్రం గుర్ఱాలాండ్ ప్రత్యేక రాష్ర్ట అంశానికి తొందరగా పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గం.లకు తిరిగి ఆరంభమైన లోక్ సభ తిరగి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. వరుసుగా నాలుగు రోజులు పార్లమెంట్ కు సెలవు దినాలు కావడంతో సభ తిరిగి సోమవారం ఆరంభమవుతుంది.
 

>
మరిన్ని వార్తలు