ఎల్టీటీఈపై నిషేధాన్ని సమర్థించిన మద్రాస్ హైకోర్టు

1 Jul, 2013 12:17 IST|Sakshi

చెన్నై: ఎల్టీటీఈపై మద్రాస్ హైకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని చెన్నై హైకోర్టు సమర్థించింది. రెండేళ్లకోసారి ఆ నిషేధం కొనసాగుతోందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రత్యేక ఈలం కోసం పోరాడుతూ ఉగ్రవాద సంస్థగా మద్రపడిన ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వం గతంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించడం సబబు కాదంటూ తమిళనాడులోని ఎండీఎంకే నేత వైకో మరికొందరు రాజకీయ నాయకులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో చెన్నై హైకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. కాగా 1991లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యానంతరం తొలిసారిగా భారత్ ఎల్‌టీటీఈని నిషేధించింది.

మరిన్ని వార్తలు