కేరళ: హెచ్‌సీఎల్‌ లైఫ్‌కేర్‌లో భారీ‌ అగ్ని ప్రమాదం..

12 Jun, 2020 20:21 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం:  కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురంలోని హిందుస్తాన్‌ లాటెక్స్‌ లిమిటెడ్(హెచ్‌సీఎల్‌ లైఫ్‌కేర్‌)‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. డంపింగ్ యార్డ్ నుంచి మొదలైన మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఉపశమనమిచ్చే విషయం. కాగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు