భారతీయుడి నమ్మకమే ‘పార్కర్‌కు’ పునాది

13 Aug, 2018 03:09 IST|Sakshi
సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: 60 ఏళ్ల క్రితం సౌర గాలులు ఉన్నాయంటూ పార్కర్‌ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌ గుర్తించకుం టే తాజా ప్రయోగం సాకారమయ్యేదే కాదు. సూర్యుడి నుంచి ఆవేశపూరిత కణాలు నిరంతరం అంతరిక్షంలోకి ప్రసారమవుతూ.. అక్కడి ప్రాంతాన్ని నింపుతున్నాయని 1958లో పార్కర్‌ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలతో కూడిన థియరీ పేపర్‌ను ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌కు సమర్పించారు. అయితే, ఇద్దరు పరిశోధకులు దీనిని తిరస్కరించారు. దీనికి కారణం అంతరిక్షాన్ని కేవలం శూన్య ప్రదేశంగా భావించే రోజులవి.

అయితే ఆ సమయంలో జర్నల్‌కు సీనియర్‌ ఎడిటర్‌గా ఉన్న చంద్రశేఖర్‌.. పార్కర్‌ సిద్ధాంతాన్ని పబ్లిష్‌ చేయాలని నిర్ణయించారు. చంద్రశేఖర్‌ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ ప్రయోగం జరిగేది కాదని ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సోలార్‌ స్టెల్లార్‌ ఎన్విరాన్‌మెంట్‌కు చైర్మన్‌గా పనిచేస్తున్న నంది వెల్లడించారు. నక్షత్రాల నిర్మాణ, పరిమాణ క్రమంలో భౌతిక ప్రక్రియల ప్రాముఖ్యతపై చేసిన పరిశోధనలకు గాను 1983లో ఫిజిక్స్‌లో నోబెల్‌ బహుమతిని విలియమ్‌ ఏ ఫోలర్‌తో కలసి సంయుక్తంగా ఆయన అందుకున్నారు. అలాగే చంద్రశేఖర్‌ సేవలకు గుర్తుగా 1999లో చంద్రశేఖర్‌ పేరుతోనే ‘చంద్ర ఎక్స్‌ రే అబ్జర్వేటరీ’అనే అంతరిక్ష ప్రయోగాన్ని నాసా చేపట్టింది.

మరిన్ని వార్తలు