మనీషా కోయిరాలా ట్వీట్‌పై విమర్శలు

22 May, 2020 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటి, నేపాల్‌ పౌరురాలు మనీషా కోయిరాలా చేసిన ఓ ట్వీట్‌ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆమెపై ట్రోల్స్‌ ప్రారంభమయ్యాయి. కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలను తమ భూభాగంలో చూపించుకుంటూ నేపాల్‌ మంత్రి పోస్ట్‌ చేసిన మ్యాప్‌ ట్వీట్‌ను మనీషా కోయిరాలా రీట్వీట్‌ చేశారు. ‘మన చిన్న దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య చర్చలన్నీ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో భారత్‌లో ఆమెపై ట్రోల్స్‌ మొదలయ్యాయి. భారత్‌ ఆమెకు సినీ జీవితం ప్రసాదిస్తే ఇప్పుడు భారత్‌ మీదే వివక్ష చూపుతున్నారని, ఆమెను బహిష్కరించాలని ట్రోల్స్‌ వచ్చాయి. 

మరిన్ని వార్తలు