రోజూ 24 కి.మీ. సైకిల్ తొక్కి..

7 Jun, 2016 02:57 IST|Sakshi
రోజూ 24 కి.మీ. సైకిల్ తొక్కి..

మెట్రిక్ పాసైన జార్ఖండ్ దళిత బాలిక
 
 రాంచీ: జార్ఖండ్ లతేహర్ జిల్లాలోని మారుమూల గ్రామం కర్మటండ్. రోడ్లు, విద్యుత్తు, ఉన్నత పాఠశాలలు వంటి సౌకర్యాలు లేవు. కానీ నేడు.. జార్ఖండ్‌లో అందరూ ఆ పల్లె గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం.. నీలూ కుమారి అనే దళిత బాలిక. మెట్రిక్యులేషన్  ఉత్తీర్ణురాలవ్వడమే ఆమె ఘనత. మెట్రిక్యులేషన్ పాస్ అవ్వడం గొప్పా? అని తీసిపారేయకండి. ఆమె పాఠశాలకు చేరుకోడానికి రోజూ 24 కి.మీలు సైకిల్ తొక్కింది. అదీ అడవులు, కొండలు, వాగులు నిండిన దారులగుండా. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సైకిల్‌నే వాడింది. పొద్దున్నే పాఠశాల సమయం కన్నా రెండు గ ంటల ముందే ఇంటి నుంచి బయలుదేరేది.

సాయంత్రం తరగతులు పూర్తయ్యాక హోం వర్క్ ముగించుకుని సూర్యాస్తమయం కన్నా ముందే ఇంటికి బయలుదేరేది. ఎండ, వాన, చలిలాంటి ఏ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు. ప్రతిరోజూ స్కూలుకెళ్లేది. 500కి 241 మార్కులు సాధించి, అదే గ్రామంలోని మరో 17 మంది బాలికలు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడానికి స్ఫూర్తి నింపింది. ప్రభుత్వం కుమారి చదివిన ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చింది.

మరిన్ని వార్తలు