‘వందేమాతరం పాడమంటే పాడం’

9 Dec, 2017 09:56 IST|Sakshi

లక్నో: ఎవరెన్ని చెప్పినా  వందేమాతరం పాడమంటే పాడమని బీఎస్పీ మేయర్‌ సునీతా వర్మ స్పష్టం చేశారు.  మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశాల ప్రారంభానికి ముందు వందే మాతరం పాడమని, జాతీయ గీతం జనగణమన ఆలపిస్తామని ఇటీవల ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపాయి.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వందేమాతరం అంటే దండం పెట్టడమని, తల్లికి కాకుండా ఉగ్రవాదులకు దండం పెడుతారా.. అని ఆయన ఘాటుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునీతా వర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గకుండా మళ్లీ పాడమని తెగేసి చెప్పడం  చర్చనీయాంశమైంది.

>
మరిన్ని వార్తలు