ప్రాణాలకు తెగించి.. మేకను రక్షించి..

28 Jun, 2020 11:02 IST|Sakshi
వీడియో దృశ్యాలు

న్యూఢిల్లీ : నెటిజన్ల మనసును ఆకట్టుకున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవ్వటం పరిపాటి. ఈ నేపథ్యంలో గతం తాలూకు సంఘటనలకు సంబంధించిన కొన్ని పాత వీడియోలు కూడా మళ్లీ వైరలవుతూ ఉంటాయి. తాజాగా లోతైన గొయ్యిలో పడ్డ ఓ మేకను రక్షించే పాత వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అస్సాం అదనపు డీజీపీ హార్థీ సింగ్‌ శనివారం ఈ వీడియోను విడుదల చేశారు. ‘‘ దేశీయ శైలిలో సంరక్షణ!  పట్టుదల, సంకల్పం, బృంద స్ఫూర్తి, ధైర్యం.. నవ్వే కళ్లతో నవ్వే ముఖాలు. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి’’ అని కోరారు. అందులోని భాషను బట్టి అది కర్ణాటక ప్రాంతంలో జరిగినట్లు స్పష్టమవుతోంది. (దొంగ‌త‌నం చేసిన మ‌రుస‌టి రోజే..)

దాదాపు ఓ నిమిషం నిడివి గల ఈ వీడియోలో వారు మేకను రక్షించిన తీరు అద్భుతం. కొంచెం పట్టుతప్పితే ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి. అయినప్పటికి పట్టుదలతో మేకను రక్షించారు. నెటిజన్లు సైతం వారి బృంద స్ఫూర్తిని కొనియాడుతున్నారు. ‘‘ అద్భుతమైన మనుషులు... వీడియో అద్భుతంగా ఉంది... అత్యంత ప్రమాదకరమైంది. వాళ్లకు సెల్యూట్‌. అతడు తన మిత్రుల్ని పూర్తిగా నమ్మాడు... వ్వావ్‌!!... గొర్రెను రక్షించిన తర్వాత వారి ముఖాలపై చిరునవ్వులు చూడండి! ఓ ప్రాణాన్ని కాపాడామనే ఆనందం అది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (వైరల్‌: మీ మనసును టచ్‌ చేసే వీడియో!)

మరిన్ని వార్తలు