జైట్లీని ప్రధాని సంప్రదించారో లేదో చెప్పం!

6 Mar, 2017 03:03 IST|Sakshi

న్యూఢిల్లీ: 2016 నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తూ ప్రకటన చేసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని సంప్రదించారో లేదో తాము చెప్పబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

పీటీఐ వార్తా సంస్థ ఈ విషయంపై దాఖలు చేసిన ఒక సమాచార హక్కు దరఖాస్తుకు గతంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)లు కూడా ఇలాగే స్పందించాయి. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆ సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. ‘సమాచార హక్కు చట్టంలోని సెక్షన్  8 (1) (ఎ) ప్రకారం మీరు కోరిన సమాచారం ఇవ్వలేం’అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీటీఐ దరఖాస్తుకు సమాధానమిస్తూ చెప్పింది. అయితే పీటీఐ కోరిన సమాచారం ఆ సెక్షన్  కిందకు ఎలా వస్తుందో మాత్రం పేర్కొనలేదు.

మరిన్ని వార్తలు