సుక్మా ఘటనపై ప్రధాని విచారం

11 Mar, 2017 15:19 IST|Sakshi
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సుక్మా జిల్లా కేంద్రానికి చేరుకుని తాజా పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు. భెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొటచెరు గ్రామ సమీపంలో శనివారం ఉదయం కూంబింగ్‌ జరుపుతున్న జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 1ద2 మంది జవాన్లు చనిపోయిన విషయం విదితమే.
మరిన్ని వార్తలు