ప్రకృతి ప్రకోపం: 58 మంది జవాన్లు మృతి

21 Mar, 2017 17:44 IST|Sakshi
న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం వల్ల 2014-2016ల మధ్య 58 మంది సైనికులు మృతి చెందినట్లు మంగళవారం రాజ్యసభ వెల్లడించింది. రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్‌ భామ్రే రాతపూర్వకంగా మంగళవారం సమాధానమిచ్చారు. 2014లో 12 మంది, 2015లో 24 మంది, 2016లో 22 మంది సైనికులు ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద సైనికస్ధావరంపై మంచు తుపాను విరుచుకుపడిన కారణంగా 15 మంది జవానులు మరణించినట్లు వెల్లడించారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు