భారత్‌మాల : ఏపీకి 3, తెలంగాణకు 2

26 Oct, 2017 09:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రహదారుల, మౌలిక వసతుల అబివృద్ధికి భారత్‌ ఒక​సాక్షిలా మారనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నిర్మిస్తున్న ఆరు జాతీయ రహదారులే కాకుండా.. భారత్‌మాల ప్రాజెక్టు కింద మరో 44 ఎకనమిక్‌ కారిడార్ల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు.. చెరో రెండు కారిడార్లను కేంద్రం ప్రకటించింది. భారత్‌ మాల ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది డిసెంబర్‌లో మొదలవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ సూచనప్రాయంగా తెలిపారు.

భారత్‌ మాల ప్రాజెక్టు కింద మొత్తం 44 ఎకనమిక్‌ కారిడార్లు, 65 ఇంటర్‌ కారిడార్లు, 115 ఫీడర్‌ కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తారు. ఇదే విషయాన్ని గడ్కిరీ తన ట్విటర్‌లో ప్రకటించారు. మొత్తం 7 లక్షల కోట్లతో కేంద్ర ప్రబుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రహదారులను నిర్మిస్తోంది. భారతదేశ మౌలిక వసతుల కల్పనలో ఇదొక సువర్ణ అధ్యాయమని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు ఇవే:
1. ముంబై-కోల్‌కతా
2. ముంబై-కన్యాకుమారి
3. అమృత్‌సర్‌-జామ్‌నగర్‌
4. కాండ్లా-సాగర్‌
5. ఆగ్రా - ముంబై
6. పూణె- విజయవాడ
7. రాయ్‌పూర్‌-ధన్‌బాద్‌
8. లూథియానా-అజ్మీర్‌
9. సూరత్‌ - నాగ్‌పూర్‌
10. హైదరాబాద్‌ - పనాజీ
11. జైపూర్‌ - ఇండోర్‌
12. షోలాపూర్‌ - నాగ్‌పూర్‌
13. సాగర్‌ -వారణాసి
14. ఖరగ్‌పూర్‌ - సిలిగురి
15. రాయ్‌పూర్‌ - విశాఖపట్నం
16. ఢిల్లీ - లక్నో
17. చెన్నై - కర్నూల్‌
18. ఇండోర్‌ - నాగ్‌పూర్‌
19. చెన్నై- మధురై
20. మంగళూరు - రాయ్‌చూర్‌
21. ట్యుటికోరిన్‌ - కొచ్చిన్‌
22. షోలాపూర్‌ - బళ్లారి
23. హైదరాబాద్‌ - ఔరంగాబాద్‌
24. ఢిల్లీ - కాన్పూర్‌
25. సాగర్‌ - లక్నో
26. సంభల్‌పూర్‌ - రాంచీ

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా.. బారత్‌మాల ప్రాజెక్టుకు మంగళవారం​కేంద్రం ప్రభుత్వం ఆమెద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా..  83,677 కిలోమీటర్ల రహదారిని రూ.7 లక్షల కోట్లతో కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ ‍ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. భారత్‌మాల ప్రాజెక్టు వల్ల కోటి ఉద్యోగల సృష్టి జరుగుతుందని మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. భారత్‌ రహదారులు అమెరికా, జర్మనీల స్థాయికి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు