గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్‌ చంద్ర

19 Sep, 2023 08:31 IST|Sakshi

భారతదేశంలో నేడు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్ల ఉత్పత్తి & వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు దాదాపు డీజిల్ కార్ల మ్యాన్యుఫ్యాక్షరింగ్ నిలిపివేస్తున్నాయి. కాగా ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం మీద ప్రస్తావించారు. కానీ దీనిపై టాటా మోటార్స్ ఎండీ శైలేశ్‌ చంద్ర స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ వాహనాల ఉత్పత్తి నిలిపివేయాలని.. లేకుంటే డీజిల్ వెహికల్స్ మీద 10 శాతం జీఎస్స్టీ విధించడానికి తగిన సన్నాహాలు జరుగుతున్నాయని గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఈ మాటలపై శైలేశ్‌ చంద్ర స్పందిస్తూ.. మార్కెట్లో టాటా డీజిల్ వాహనాలకు డిమాండ్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2024 నాటికి పూర్తి స్థాయిలో ఈ వాహనాల ఉత్పత్తి నిలిపివేసే లక్ష్యంగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికి కూడా చాలామంది వాహన కొనుగోలుదారులు డీజిల్ వెహికల్స్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారని, దశల వారీగా వీటి ఉత్పత్తి తగ్గిస్తూ.. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నియమాలకు లోబడి ఉంటామని.. 2024 నాటికి డీజిల్ వెహికల్స్ ఉత్పత్తిని జీరో చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని శైలేశ్‌ చంద్ర వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!

ప్రస్తుతం కొన్ని విభాగాలలో మాత్రమే డీజిల్ మోడల్స్ ఉన్నాయి, వీటిని కూడా వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోకి మార్చడానికి సన్నద్ధమవుతామని తెలిపారు. కాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా డీజిల్ ఇంజిన్ కార్లను తమ పోర్ట్‌ఫోలియోలో తొలగించడానికి ససేమిరా అంటోంది.

మరిన్ని వార్తలు