బాబోయ్ ఇదేమి ట్రాఫిక్

26 Jul, 2014 00:12 IST|Sakshi
బాబోయ్ ఇదేమి ట్రాఫిక్

గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వేపై కేంద్ర మంత్రి నితిన్

గుర్గావ్: నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కేంద్ర రవాణా,  జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఢిల్లీకి 43 కిలోమీటర్ల దూరంలోని ఖేర్కి దౌలా టోల్‌ప్లాజా వద్ద ఆయన శుక్రవారం ట్రాఫిక్ జాంలో దాదాపు 20 నిమిషాలపాటు చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఆయన వెంట స్వతంత్ర మంత్రి (ప్ర;ణాళికా శాఖ) ఇందర్‌జిత్‌సింగ్, సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుజ్జార్ తదితరులు ఉన్నారు. ఢిల్లీ-జైపూర్. కుంది-మనే సార్-పాల్వాల్ మధ్య నిర్మాణ దశలో ఉన్న ఫ్లైఓవర్‌ను సందర్శించేందుకు ఆయన ఇక్కడికొచ్చారు.
 
తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ ‘పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’ అని అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన కార్యాచరణను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా గడ్కరీ కాన్వాయ్ తొలుత గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌పై రాజీవ్‌చౌక్ వద్ద ఆగిపోయింది. దీంతో ఈ ప్రాంత డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌లతో కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత మనేసార్ దిశగా వెళుతుండగా మరోసారి కారు ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయింది.

మరిన్ని వార్తలు