అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ

28 Nov, 2023 21:16 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌  కావడంతో సర్వత్రా  ఆనందం వ్యక్తమవుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది సురక్షితంగా బయటకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కార్మికులు క్షేమంగా తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో పాల్గొన్న  ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.  వారి ధైర్యం, సంకల్పం కార్మిక సోదరులకు కొత్త జీవితాన్నిచ్చాయన్నారు. మానవత,జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారంటూ రెస్క్యూ టీంను   ప్రశంసించారు. 

ఉత్తరకాశీలో  కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.  ధైర్యం, సహనం అందరికి స్ఫూర్తిని కలిగిస్తున్నాయంటూ కార్మికులను అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇంతకాలం నిరీక్షణ తర్వాత కార్మికులు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం. ఈ సమయంలో సహనంతో ఆయా కుటుంబాలన్నీ చూపించిన ఓర్పు, ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేమని కొనియాడారు. (ఉత్తరాఖండ్‌ టన్నెల్‌: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్)

రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము కూడా  కార్మికులును వెలికి తీసుకొచ్చిన ఘటనపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర నితిన్‌ గడ్కరీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. తన  సందేశాన్ని  వీడియో రూపంలో ట్విటర్‌లో షేర్‌ చేశారు. అలాగే  నటుడు సోనూ  సూద్‌ ట్విటర్‌ ద్వారా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్‌ మహీంద్ర)

మరిన్ని వార్తలు