అందరికీ ఉద్యోగాలివ్వడం కుదరదు: అమిత్ షా

26 May, 2017 18:44 IST|Sakshi
అందరికీ ఉద్యోగాలివ్వడం కుదరదు: అమిత్ షా
న్యూఢిల్లీ : 125 కోట్ల మంది జనాభా గల భారత దేశంలో ఆర్గనైజ్ సెక్టార్ లో అందరికీ ఉద్యోగవకాశాలు కల్పించడం కుదరదని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఈ కారణంతోనే స్వరోజ్ గార్(స్వయం-ఉపాధి)ని ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు.  ఎన్డీయే ప్రభుత్వం పాలనలోకి వచ్చిన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత మూడేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను మీడియాకు తెలిపారు. నిరుద్యోగం ఎక్కడా లేదని, కేవలం మీడియా రిపోర్టులోనే ఉందని అమిత్ షా మండిపడ్డారు.
 
నిరుద్యోగంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.  నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ శాతం 2013-14లో 4.9 శాతముంటే, 2015-16లో స్వల్పంగా 5శాతానికి పెరిగిందని అధికారిక గణాంకాలు వచ్చాయి. ఈ అధికారిక గణాంకాలను ప్రతిపక్షాలు టార్గెట్ గా చేసుకున్నాయి. లేబర్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం 2016 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 1.52 లక్షల మంది క్యాజువల్ లేబర్ ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిసింది. ఈ సమయంలోనే నవంబర్ 8న ప్రధాని హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేశారు. బోర్డర్ ఎకనామిక్ రివైల్ కింద బీజేపీ ఉద్యోగాల సృష్టికి,  ఎంటర్ ప్రీన్యూర్ షిప్ అవకాశాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని అమిత్ షా తెలిపారు.  స్వయం- ఉపాధికి యువతను ఎక్కువగా ప్రోత్సహించనున్నట్టు కూడా వాగ్ధానం చేశారు.
 
మరిన్ని వార్తలు