‘ఆ శాటిలైట్‌ను పాకిస్తాన్‌ వద్దంది’

4 Jan, 2017 18:19 IST|Sakshi
‘ఆ శాటిలైట్‌ను పాకిస్తాన్‌ వద్దంది’

తిరుపతి: సార్క్‌ శాటిలైట్‌ పేరుతో ఇస్రో రోదసిలోకి పంపాలనుకున్న ఉపగ్రహాన్ని పాకిస్తాన్‌ అడ్డుకుందని ఇస్రో శాస్త్రవేత్త ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. సార్క్‌ ఫోరం ఆధ్వర్యంలోనే ఈ శాటిలైట్‌ను ప్రయోగించాలని పట్టుబట్టటంతో చివరికి ఈ ప్రాజెక్టు నుంచి పాకిస్తాన్‌ను పక్కనపెట్టినట్లు ఆయన వివరించారు. దీంతో సార్క్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ సేవలను భారత్‌తోపాటు శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాలు ఉపయోగించుకోనున్నాయని వెల్లడించారు.

అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డు స్థాయిలో 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 100 ఉపగ్రహాలు అమెరికా, జర్మనీ తదితర దేశాలవేనని వివరించారు. వీటన్నిటినీ శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-37 రాకెట్‌ ద్వారా ఒకేసారి పంపనున్నట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు