మయన్మార్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

10 Jun, 2015 23:05 IST|Sakshi

న్యూఢిల్లీ: మయన్మార్లో భారత సైన్యం దాడులు జరిపి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన మరుసటిరోజు నెలకొన్న తాజా పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ మేరకు మయన్మార్ కు బయలుదేరి వెళ్లాల్సిందిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను ఆదేశించారు. తాజా పరిస్థితులపై సమాచార సేకరణతోపటు పలువురు కీలక వ్యక్తులతో జితేంద్ర చర్యలు జరుపుతారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) ఉగ్రవాదులు భారత సైన్యంపై జరిపిన దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఘటనకు బాధ్యులైనవారిపై విడిచిపెట్టేది లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మయన్మార్ దళాలతో కలిసి మంగళవారం భారత సైన్యం ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా,  మయన్మార్ లో భారత సైన్యం చర్యకు రాజకీయ రంగులు పులిమే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

మరిన్ని వార్తలు