డ్యూటీ కోసం వంద‌ల కిమీ న‌డిచిన పోలీస్‌

31 Mar, 2020 15:24 IST|Sakshi

భోపాల్: క‌రోనా వ్యాప్తి నిరోధించ‌డానికి పోలీసులు ప‌డుతున్న శ్ర‌మ అనిర్వ‌చ‌నీయం. ఓవైపు జ‌నాలు గుమిగూడ‌కుండా నిరంత‌రం వెయ్యిక‌ళ్ల‌తో ప‌ర్య‌వేక్షిస్తూ.. ప‌గ‌లూ రాత్రీ తేడా లేకుండా గ‌స్తీ కాస్తూ నిర్విరామంగా ప‌ని చేస్తున్నారు. పైగా క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తున్న ఈ స‌మ‌యంలో వారి అవ‌స‌రం కూడా ఎంతో ఉంది. దీన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ త‌న‌ విధులు నిర్వ‌ర్తించేందుకు 450 కిలోమీటర్లు న‌డిచి శభాష్‌ అనిపించుకున్నాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన 22 ఏళ్ల దిగ్విజ‌య్ శ‌ర్మ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. డిగ్రీ ప‌రీక్ష‌ల నిమిత్తం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇటావాకు వెళ్లిన అత‌డు సెల‌వులో ఉన్నాడు. తీరా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌టంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాన‌ని బాస్‌ను సంప్ర‌దించాడు. (కానిస్టేబుల్‌ ర్యాప్‌ సాంగ్‌.. నెటిజన్లు ఫిదా!)

లాక్‌డౌన్ నేప‌థ్యంలో అక్క‌డి నుంచి స్వ‌స్థ‌లానికి రావ‌డానికి ఎలాంటి వాహ‌నాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయ‌న‌ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమ‌ని పై అధికారులు సూచించారు. దానికి అత‌ను స‌సేమీరా అన్నాడు. ఎలాగైనా డ్యూటీకి వెళ్లి తీరాల్సిందేన‌ని ధృడంగా నిశ్చ‌యించుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా మార్చి 25న ఉద‌యం కాలిన‌డ‌కన బ‌య‌లు దేరాడు. మ‌ధ్య‌లో కొన్నిసార్లు లిఫ్ట్ తీసుకుంటూ, న‌డుచుకుంటూ.. సుమారు 20 గంట‌ల త‌ర్వాత మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్‌కు చేరుకున్నాడు. దారి మ‌ధ్య‌లో ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోలేదు. ఈ విషయం తెలిసిన అధికారులు అత‌ని నిర్ణ‌యాన్ని మెచ్చుకోవ‌డ‌మే కాక కాలిన‌డ‌క‌న వ‌చ్చినందున కాస్త విశ్రాంతి తీసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చారు. అయితే అత‌ను మాత్రం వెంట‌నే విధుల్లోకి చేరేందుకు ప‌ట్టుబ‌డుతుండ‌టం విశేషం. (మహిళా కానిస్టేబుల్‌కు కరోనా లక్షణాలు?)

>
మరిన్ని వార్తలు