గర్భిణీ ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు

5 Jun, 2020 12:06 IST|Sakshi

తిరువనంతపురం: గర్భిణీ ఏనుగు మృతి కేసులో పోలీసులు శుక్రవారం ఒకరిని అరెస్ట్ చేశారు. నలభై ఏళ్ల వయసున్న నిందితుడు పేలుడు పదార్థాలను అమ్ముతాడని తెలిసింది. ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్ చేశామని, త్వరలోనే మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని కేరళ అటవీశాఖ మంత్రి తెలిపారు. ఈ కేసులో ఇదే తొలి అరెస్టు కావడం గమనార్హం. తాజాగా అరెస్టు చేసిన వ్యక్తి స్థానికంగా పేలుడు పదార్థాలను అమ్ముతాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. మిగతా నిందితుల కోసం వెతుకున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఆక‌లితో ఉన్న గ‌ర్భిణీ ఏనుగుకు పైనాపిల్‌ (అనాస పండు)లో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించి చంపిన‌‌‌ ఘ‌ట‌న‌పై యావ‌త్ దేశం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. 
(చదవండి: ఏనుగు హ‌త్య‌: అత‌నికి సంబంధం లేదు)

ఈ ఘ‌ట‌న‌పై కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ ద‌ర్యాప్తుకు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఏనుగు నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నవారిని కఠినంగా శిక్షిస్తామని, ఇప్పటికే ముగ్గురు అనుమానితులను గుర్తించామని ఆయన గురువారం వెల్లడించారు. కాగా, క్రూర జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాసులు, పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. అయితే, ప్రమాదకర చర్యలతో మూగ జీవాల ప్రాణాలు తీయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
(చదవండి: ఏనుగు నోట్లో పైనాపిల్‌ బాంబ్‌)

మరిన్ని వార్తలు