లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రీతిజింటా చేయలేదట!

17 Jun, 2014 13:06 IST|Sakshi
లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రీతిజింటా చేయలేదట!
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని ఐపీఎల్ ఫ్రాంచైజీ సహ భాగస్వామి ప్రీతి జింటా తరపు న్యాయవాది హితేష్ జైన్ వెల్లడించారు. బహిరంగ ప్రదేశంలో ప్రీతిజింటాపై నెస్ వాడియా అసభ్య పదజాలం ఊపయోగించి అవమాన పరిచాడని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో న్యాయవాది వెల్లడించారు. 
 
తన ఫిర్యాదులో లైంగికంగా వేధించడానే ఆరోపణ ఎక్కడ చేయలేదని.. పబ్లిక్ లో అసభ్యకరంగా దూషించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని న్యాయవాది తెలిపారు.
 
అసభ్య పదజాలంతో దూషించడం కారణంగానే అవమానంగా ఫీలైన ప్రీతిజింటా ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. నెస్ వాడియాపై ఐపీసీ 354 సెక్షన్ ప్రకారం కేసు నమోదైందని.. ఆ సెక్షన్ ప్రకారం నమోదైన కేసు లైంగిక వేధింపులు కిందకు రాదని ప్రీతి జింటా తరపు న్యాయవాది జైన్ వెల్లడించారు. 
మరిన్ని వార్తలు