భారతీయుడవని నిరూపించుకో..!

1 Oct, 2017 17:54 IST|Sakshi

రిటైర్డ్‌ ఆర్మీఅధికారికి సమన్లు

బంగ్లాదేశీ వలసదారుడివేకదా?

30 ఏళ్లు సేవ చేశా?

అందుకు ఇదా గుర్తింపు!

అతను 30 ఏళ్లు ఇండియన్‌ ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేశారు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ నుంచి, పాక్‌ సరిహ్‌ద్ధుల వరకూ, కశ్మీర్‌ నుంచి బంగ్లా, చైనా బోర్డర్‌ వరకూ పనిచేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నారు. ఆర్మీలో సర్వీసు పూర్తి చేసుకుని 2016 అక్టోబర్‌ రిటైర్‌ అయ్యారు. ఇప్పుడ అతన్ని నువ్వు భారతీయుడవేనా? ఇండియన్‌ అయితే నిరూపించుకో? అంటూ అసోం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

గువాహటి : మహమ్మద్‌ అబ్దుల్‌ హక్‌.. అసోంలోని కళహికాష్‌ గ్రామవాసి. 30 ఏళ్ల పాటు భారతీయ సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి.. జూనియర్‌ కమిషనష్డ్‌ ఆఫీసర్‌ హోదాలో రిటైర్‌ అయ్యారు. విశ్రాంతీ జీవితం గడుపుతున్న దశలో అతనికి ఊహించని షాక్‌ తగిలింది.  నిన్ను అనుమానాస్పద ఓటర్‌గా గుర్తిస్తూ నీ ఓటు హక్కు తొలగిస్తున్నాం.. నువ్వు అసలు భారతీయుడవేనా? అయితే నిన్ను నువ్వు నిరూపించుకో? ఇండియన్‌ అని చెప్పే ఆధారాలు చూపించు.. అని ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌ నుంచి హక్‌కు నోటీసులు అందాయి. హక్‌కేకాక అతని భార్య అయిన ముంతాజ్‌ బేగంకి సైతం ఇటువంటి నోటీసులు అందాయి.

భారత ప్రభుత్వం 1971 తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించేందుకు ఇటువంటి నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్పారు.. నేను పుట్టకతోనే భారతీయుడను.. మా నాన్న మఖ్బూల్‌ ఆలీపేరు 1966 ఓటర్ల జాబితాలో ఉంది. అంతేకాక 1961, 1962లో జరిపిన గ్రామాల సర్వేలోనే మా కుటుంబం పేరు ఉంది. ఇక నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) రికార్డుల్లో మా అమ్మ రహిమాన్‌ నీసా పేరుంది. మేం వలస వచ్చినవాళ్లం కాదు అని హక్‌ స్పష్టం చేశారు.

ట్రిబ్యునల్‌ నుంచి వచ్చిన సమన్తు చూపుతూ.. నేను 1986లో ఇండియన్‌ ఆర్మీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా చేరాను. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ.. జూనియర్‌ కమిషన్ట్‌ అధికారిగా 2016 అక్టోబర్‌లో రిటైర్‌ అయ్యాను. ఉద్యోగంలో భాగంగా.. నేను ఎల్‌ఇండో-చైనా బోర్డర్‌ అయిన తవాంగ్‌లోనూ, ఇక లక్నో,  కోటా, సికింద్రాబాద్‌లోనూ పనిచేశాను.

,
 

మరిన్ని వార్తలు