రాజస్తాన్‌లో ప్రైవేట్‌ వాహనాలకు ‘టోల్‌’ లేదు

2 Apr, 2018 04:33 IST|Sakshi

జైపూర్‌: జాతీయ రహదారులపై టోల్‌ ట్యాక్స్‌ పెరగ్గా రాజస్తాన్‌ ప్రభుత్వం మాత్రం వాహనదారులకు ఊరట కల్పించింది. రాష్ట్ర రహదారులపై తిరిగే ప్రైవేట్‌ వాహనాలకు టోల్‌ను తొలగించింది. ఈ మినహాయింపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్‌ ఖాన్‌ తెలిపారు.

జిల్లా రోడ్లతోపాటు 15,534 కిలోమీటర్ల పొడవైన 56 రాష్ట్ర రహదారులపై నిత్యం 1.25 లక్షల ప్రైవేట్‌ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, వీటిపై 143 పాయింట్లలో టోల్‌ ట్యాక్స్‌ వసూళ్లు జరుగుతుంటాయని వివరించారు. పన్ను మినహాయింపు ఫలితంగా ప్రజలకు రూ.250 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు