అయికిడో ప్రాక్టీస్‌ చేస్తున్న రాహుల్‌

1 Nov, 2017 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మార్షల్‌ ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడో వచ్చని.. అందులో తనకు బ్లాక్‌ బెల్ట్‌ ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మూడు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌ గాంధీ అయికిడో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను ఆయన అధికార ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రాహుల్‌ గాంధీ అయికిడో ప్రాక్టీస్‌ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు