సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా: రాహుల్

17 Mar, 2014 14:35 IST|Sakshi
సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా: రాహుల్
కాంగ్రెస్ పార్టీ 'యువరాజు' పెళ్లిపై గత కొద్దికాలంగా ఎడతెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి గురించి రాహుల్ మనసులో మాట బయటపెట్టారు. తనకు సరిపోయే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిసారి ఇదే ప్రశ్న ఎదురవుతోంది.. ప్రస్తుతం నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టే సమయం లేదు అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 
 
సరియైన అమ్మాయి దొరక్కగానే పెళ్లి చేసుకుంటాను.  మరో సంవత్సరం లేదా, మరో రెండు సంవత్సరాలు పట్టవచ్చు.  అని ఓ ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. తనకు బాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి లేదని.. తన సోదరి ప్రియాంక హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తుందని అన్నారు. అలాగే తనకు అభిమాన తారలేవరూ లేరని.. ఫెర్మార్మెన్స్ ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ చెప్పారు. 
మరిన్ని వార్తలు