‘అందుకే మోదీని కౌగిలించుకున్న’

23 Feb, 2019 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షడు రాహుల్‌ గాంధీ శనివారం జేఎన్‌యూ స్టేడియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుల్వామా దాడితో పాటు.. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న అంశం గురించి కూడా మాట్లాడారు. తొలుత పుల్వామా దాడి గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం వీర జవాన్ల కుటుంబీకులు పడుతున్న బాధ ఎలాంటిదో నేను ఊహించగలను. ఉగ్రవాదం నా కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసింది. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హింస ఎన్నటికి సమాధానం కాదు.  ప్రేమ మాత్రమే హింసను నాశనం చేయగల్గుతుంద’ని తెలిపారు.

ఈ సందర్భంగా లోక్‌సభలో మోదీని ఆలింగనం చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘మోదీ ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్నారని నాకు అనిపించింది. ఆత్మీయ ఆలింగనంలోని మాధుర్యాన్ని ఆయనకు తెలియజేయాలని అనుకున్నాను. అందుకే మోదీని ఆలింగనం చేసుకున్నాను. నేను అలా చేస్తానని మోదీ కూడా ఊహించలేదు. ఈ షాక్‌ నుంచి తేరుకోవడానికి ఆయనకు కాస్తా సమయం పట్టింది’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. దేశ సంపద అంతా కొందరి చేతుల్లోనే ఉందని.. ఇది మంచి పద్దతి కాదని తెలిపారు.

మరిన్ని వార్తలు