కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌గా మోతీలాల్‌ వోరా

3 Jul, 2019 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. పార్టీ చీఫ్‌గా తప్పుకుంటూ పార్టీ శ్రేణులకు రాహుల్‌ నాలుగు పేజీల బహిరంగ లేఖను రాశారు. పార్టీ నుంచి తప్పుకునేందుకు దారితీసిన పరిస్థితులపై ఈ లేఖలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనదే బాధ్యతని ఆయన అంగీకరించారు. పార్టీలో విప్లవాత్మక మార్పులు రావాలని కోరారు. సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యతక అందరికీ ఉందన్న రాహుల్‌ కొత్త అధ్యక్షుడి ఎన్నికలో తన పాత్ర ఉండదని స్పష్టం చేశారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా కొనసాగేందుకు పార్టీ సీఎంలు బుజ్జగించినా రాహుల్‌ గాంధీ నిరాకరించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగరాదని పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా ఆయన మెత్తబడలేదు. ప్రస్తుతం తాను పార్టీ అధ్యక్ష పదవిలో లేనని స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడి నియామకంపై పార్టీ సత్వరమే స్పందించాలని కోరారు. తాను ఇప్పటికే పార్టీ చీఫ్‌గా వైదొలిగానని, అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తక్షణమే సమావేశమై నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగాలని పార్టీ క్షేత్ర స్ధాయి నేతల నుంచి, పార్టీ సీఎంల వరకూ రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చినా రాహుల్‌ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పార్టీ నేతలు రాజీనామాలు సమర్పించినా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ నూతన చీఫ్‌ ఎంపిక ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.


తాత్కాలిక చీఫ్‌గా మోతీలాల్‌ వోరా
రాహుల్‌ పార్టీ చీఫ్‌గా వైదొలగడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్‌ వోరాను నియమించారు. చత్తీస్‌గఢ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న 90 సంవత్సరాల వోరా నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా