రైల్వే బడ్జెట్-సైడ్‌లైట్స్...

27 Feb, 2015 01:38 IST|Sakshi
రైల్వే బడ్జెట్-సైడ్‌లైట్స్...

ఎంపీల్యాడ్స్ నిధులా.. నో..నో!
-    ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో వసతులను మెరుగుపర్చేందుకు ఎంపీల్యాడ్స్ నిధులను ఇవ్వాలంటూ మంత్రి సురేశ్ ప్రభు చేసిన విజ్ఞప్తికి నో.. నో.. అంటూ ప్రతిపక్ష సభ్యులంతా ముక్తకంఠంతో తిరస్కరించారు.
 -    మంత్రి ప్రసంగం ముగిసినా, కొత్త రైళ్ల ఊసేమీ లేకపోవడంతో ప్రతిపక్షంలోని అనేక మంది సభ్యులు నిరాశలో మునిగి పోయినట్లు కనిపించారు.
 -    రైల్వేను మెరుగుపర్చేందుకు తన దీర్ఘకాలిక విజన్‌ను వివరించే ముందు.. ‘హే ప్రభూ.. ఏ కైసే హోగా?(దేవుడా, ఇదెలా చేయాలి?)’ అంటూ మంత్రి సురేశ్ ప్రభు చమత్కరించారు.
 -    ‘కుచ్ నయా జోడ్ నా హోగా, కుచ్ పురానా తోడ్‌నా హోగా(కొన్ని కొత్తవాటిని  చేర్చాలి. కొన్ని పాతవాటిని వదిలేయాలి)’ వంటి సూక్తులు వల్లిస్తూ ప్రసంగాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు.
 -    రోడ్డు రవాణా మంత్రి గడ్కారీ వైపు చూస్తూ.. రోడ్డు రవాణా కన్నా రైల్వేలు తక్కువ కార్బన్‌డయాక్సైడ్ విడుదల చేస్తాయని, ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తాయని మంత్రి చమత్కరించగా, గడ్కారీ అంగీకరించినట్లుగా తలఊపారు.
 -    తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ప్రతిపక్షం నుంచి అభ్యంతరాలేమీ రానీయకుండానే మంత్రి తన ప్రసంగాన్ని సాఫీగా ముగించారు.

మరిన్ని వార్తలు