రైల్వేలో పేదల కోటా కింద 23 వేల ఉద్యోగాలు

24 Jan, 2019 05:11 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతోందని ఆ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రాబోయే రెండేళ్లలో దాదాపు 23,000 మందికి ఈ కోటా కింద ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఆరు నెలల్లోగా 1.31 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామనీ, రాబోయే రెండేళ్లలో మరో లక్ష ఉద్యోగుల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. 2019–20 మధ్యకాలంలో 53 వేల మంది, 2020–21 కాలంలో 46 వేల మంది ఉద్యోగులు రైల్వేశాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు