మూడోరోజూ కొనసాగిన రగడ..వాయిదా

6 Aug, 2015 11:22 IST|Sakshi

న్యూఢిల్లీ:   పార్లమెంటు  సమావేశాల ప్రతిష్టంభన కొనసాగుతోంది.  25 మంది ఎంపీల  సస్పెన్షన్పై   గురువారం కూడా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి ప్రతిపక్ష సభ్యులు కూడా మద్దతుగా నిలిచాయి. దీంతో విపక్షాల ఆందోళనతో వరుసగా మూడోరోజు కూడా సభలో రగడ  కొనసాగింది. 


సభ ప్రారంభం కాగానే హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ ఉధంపూర్ టెర్రరిస్టు దాడి ఘటనకు సంబంధించి సభలో ఒక ప్రకటన చేశారు.  ఈ దాడిలో ప్రాణాలు  కోల్పోయిన  వీర జవాన్లకు ఘనంగా నివాళుర్పించింది. ఉపాధ్యక్షుడు కురియన్  ప్రశ్నోత్తరాల కార్యక్రమం  చేపట్టగానే  సభ్యులు  నినాదాలతో  హోరెత్తించారు.   పోడియం ముందుకు దూసుకొచ్చి సభను అడ్డుకున్నారు. చర్చకు సహకరించాలని స్పీకర్ పదే పదే  విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో మధ్యాహ్నం 12  గంటలకు సభ ను వాయిదా వేశారు.
 

మరిన్ని వార్తలు