‘ఎద్దు మాంసం తిని మతానికి తీరని కళంకం తెచ్చావ్‌’

10 Dec, 2018 09:42 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ చరిత్రకారుడు.. బీజేపీ పార్టీ విమర్శకుడు రామచంద్ర గుహను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు ట్విట్టర్‌ యూజర్లు. వివరాలు.. శనివారం రామచంద్ర గుహ గోవాలో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘పనాజీలో ఎద్దు మాంసం తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. దాంతో ఆగ్రహించిన నెటిజన్లు గుహను విపరీతంగా ట్రోల్‌ చేయడమే కాక.. ఫోన్‌ చేసి మరి బెదిరించినట్లు తెలిపారు గుహ. విమర్శలు ఎక్కవ అవడంతో  ఆ ఫోటోను డిలీట్‌ చేశానని తెలిపారు. ఈ విషయం గురించి గుహ మాట్లాడుతూ.. ఆర్‌కే యాదవ్‌ అనే మాజీ రా(రిసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌) ఉద్యోగి ‘ఒక హిందువు ఎద్దు మాసం తినడమే కాక.. ఆ విషయం గురించి ప్రచారం చేసుకుంటూ మతానికి తీరని కళంకం తెచ్చావు. ఈ దారుణ చర్య ద్వారా నువ్వు హిందువులను బాధించావు. ఇందుకు తగిన సమాధానం చెప్తాం’ అంటూ ట్వీట్‌ చేశాడని వెల్లడించారు.

అంతేకాక ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఫోన్‌ చేసి తనను, తన భార్యను బెదిరించారని పేర్కొన్నారు గుహ. తనకు వచ్చిన ఈ బెదిరింపు సందేశాలను, ఫోన్‌ కాల్స్‌ని రికార్డ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. మరికొన్ని విమర్శలు కూడా రావడంతో ఆ ఫోటోను తొలగించారు. అనంతరం బీజేపీని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు గుహ. ‘నేను గోవాలో లంచ్‌ చేస్తున్నప్పటి ఫోటోను డిలీట్‌ చేశాను. ఈ సందర్భంగా ఎద్దు మాంసం పట్ల బీజేపీ సృష్టించిన హిపోకస్రీని మెచ్చుకుంటున్నాను. ఆహారం, దుస్తులు, ప్రేమ విషయంలో మనషులు తమ మనసుకు నచ్చినట్లు చేసే హక్కు ఉందని’ తెలిపారు.

ప్రస్తుతం దేశంలో రాజస్తాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, వంటి రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని పూర్తిగా నిషేధించారు. కానీ కేరళ, పశ్చిమ బెంగాల్‌, గోవా వంటి రాష్ట్రాల్లో దీని మీద ఎటువంటి నిషేధం లేదు.

మరిన్ని వార్తలు