అరుదైన ‘మంచు చిరుత’ను చూశారా?

18 Feb, 2020 11:29 IST|Sakshi

‘ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్‌’గా పిలుచుకునే అరుదైన మంచు చిరుతకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో మంచు కొండల మీద ఠీవీగా నడుస్తున్న ఈ చిరుత నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘ స్పిటి జిల్లాలో ఈ అద్భుతం దర్శనమిచ్చింది. మంచు చిరుతలు ఎంతో అందమైనవి. సాధారణ చిరుతల వలె పసుపు రంగు కళ్లు.. గాకుండా ఇవి పచ్చని, బూడిద రంగు కళ్లు కలిగి ఉంటాయి. వాటి తోకలు కూడా ఎంతో బారుగా ఉంటాయి. చలిని తట్టుకునేందుకు ఐదు ఇంచుల మందం గల జుత్తు కూడా ఉంటుంది. ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్‌ అరుదుగా కన్పిస్తూ ఉంటుంది’’ అంటూ అటవీశాఖ అధికారి సుసాంటా నందా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఇక అప్పటి నుంచి ఇది లైకులు, రీట్వీట్లతో దూసుకుపోతోంది. మంచు చిరుతను చూసిన వారంతా.. ‘అరుదైన వీడియో షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు. బిగ్‌ క్యాట్‌ చాలా బాగుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మంచు చిరుతలు భూమి నుంచి దాదాపు 9800 నుంచి 17 వేల అడుగుల ఎత్తున కనిపిస్తాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిబ్బర్‌ వైల్డ్‌ లైఫ్‌ సాంక్చువరీ, కిన్నార్‌ జిల్లాలో ఇవి అప్పుడప్పుడూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు