ఐఏఎస్‌ రవి కోటకు కీలక పదవి

4 Jun, 2020 17:15 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలుగు ఐఏఎస్‌ అధికారి రవి కోటకు కీలక పదవి దక్కింది. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా ఆయన నియమితులయ్యారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకనమిక్‌ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి కోట.. భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట.. 1993 బ్యాచ్‌ అసోం క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. గత రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

చదవండి: వడ్డీ రద్దుపై కేంద్రం వివరణ కోరిన సుప్రీం

మరిన్ని వార్తలు