శబరిమల తీర్పు : మతం కన్నా సమానత్వం ముఖ్యం

28 Sep, 2018 20:33 IST|Sakshi

సుప్రీంకోర్టు తీర్పుపై మేనకా గాంధీ హర్షం

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనా ప్రదేశాల్లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరీకి సమాన హక్కులు కల్పించేందుకు ఈ తీర్పు దోహద పడుతోందని మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

మతం కన్నా, సమానత్వం ముఖ్యం..
సుప్రీం తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అద్భుతమైనదిగా ఆమె వర్ణించారు. హిందుత్వంలో స్త్రీ, పురుష భేదం లేదని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తనకెంతో ఆనందం కలిగించిందని అన్నారు. మతం కన్నా, సమానత్వం ముఖ్యమైనదని సుప్రీంకోర్టు రుజువు చేసిందని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆలయంలోకి మహిళ ప్రవేశంతో అందరికీ సమాన హక్కుని కల్పించిందన్నారు. తమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.

శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

అంబేద్కర్‌ నిజంగా గొప్పవాడు..
రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్నేళ్లకు మహిళలకు న్యాయం జరిగిందని కర్ణాటక మహళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి జయమాల సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంతో ఇంతగా సంతోష పడిన రోజు ఇంకోకటి లేదని.. రాజ్యాంగాన్ని నిర్మించి మహిళల హక్కులు గుర్తించిన అంబేద్కర్‌ నిజంగా గొప్పవాడని గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా అనేక మంది మహిళా ఉద్యమ నేతలు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్న దానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు