‘తేజ్‌పాల్‌’ విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

24 Feb, 2018 03:36 IST|Sakshi
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌

న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తనపై మోపిన అభియోగాలను తొలగించాలంటూ తేజ్‌పాల్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బాబ్డేల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించి ఉండాల్సిందని తేజ్‌పాల్‌ తరపున కపిల్‌ సిబల్‌ వాదించారు. ఇంతలోనే విచారణ నుంచి జడ్జి తప్పుకున్నారు.

మరిన్ని వార్తలు