సోషల్‌ మీడియాకు ఆధార్‌ లింక్‌ : పిటిషన్‌ కొట్టివేత

14 Oct, 2019 14:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ ఖాతాలు, ఫేక్‌ న్యూస్‌ను నిరోధించేందుకు సోషల్‌ మీడియా ఖాతాలన్నింటికీ ఆధార్‌ను అనుసంధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం తోసిపుచ్చింది. అన్ని వివాదాలకు సుప్రీం కోర్టు తలుపు తట్టాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియా ఖాతాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్ధానం ప్రతిదానికీ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పనిలేదని, ఈ అంశం మద్రాస్‌ హైకోర్టు ముందుందని, అక్కడికి వెళ్లాలని సూచించింది. ఫేక్‌ న్యూస్‌, పెయిడ్‌ న్యూస్‌లను నివారించేందుకు సోషల్‌ మీడియా ఖాతాలను ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాథ్యాయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

>
మరిన్ని వార్తలు