విభజనను మీరైనా అడ్డుకోండి!

26 Oct, 2013 02:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీః రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని  రాజ్యాంగ సూత్రాల ప్రకారం అడ్డుకోవాలంటూ సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఢిల్లీలో గవర్నర్ నరసింహన్‌ను కోరారు. మెజారిటీ ప్రజల, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను విస్మరించి విభజన బిల్లును తెచ్చే కేంద్రం యుత్నాలను నివారించాలని  విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తీర్మానం, బిల్లు రెండూ రాష్ట్ర శాసనసభకు పంపాలని తవు మాటగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు  చెప్పాలని విన్నవించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కసరత్తు నేపథ్యంలో  కీలక నివేదికలను కేంద్ర పెద్దలకు అందించేందుకు ఢిల్లీ వచ్చిన గవర్నర్‌ను శుక్రవారం సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి కలుసుకున్నారు.
 
  ప్రధానితో గవర్నర్ సమావేశానికి ముందు వారు సువూరు 20 నిమిషాలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. సీమాంధ్రుల ఆందోళనలను, మనోభావాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భాషా ప్రాతిపదికతో ఏర్పాటుచేసిన రాష్ట్రాలను వుళ్లీ విడగొట్టడం దేశ సమైక్యతకే ముప్పు అవుతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకోసం రెండు రాష్ట్రాల తీర్మానాలను తీసుకున్నారని, విభజనపై అసెంబ్లీ తీర్మానం కోరకపోవడం ఏమిటని ప్రశ్నించారు.  దేశ సమైక్యతకు, సీమాంధ్రుల మనోభావాలకు గౌరవమిస్తూ, రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని విన్నవించారు. ఇందుకు గవర్నర్ స్పందిస్తూ, అన్ని అంశాలనూ ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.  అనంతరం మంత్రులు టీజీ, గంటా మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రం తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. చట్టసభలను గౌరవించి బిల్లు, తీర్మానం రెండూ అసెంబ్లీకి వచ్చేలా చూడాలని కోరాం’ అని తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం సీవూంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్ర పర్యాటక శాఖ సహాయు మంత్రి చిరంజీవి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు పయునవుయ్యూరు.
 

మరిన్ని వార్తలు