‘సిగ్గు పడాల్సిన విషయం’

9 Nov, 2017 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్యంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పరిస్థితులకు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు బాధ్యత వహించాలని పేర్కొంది. భవిష్యత్‌ తరాలను ఇటువంటి వాతావరణాన్ని అందిస్తున్నందుకు అందరూ సిగ్గు పడాలని స్పష్టం చేసింది. శీతాకాలంలో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయన్న సంకేతాలు ఉన్నపుడు చర్యలు ఎందుకు తీసుకోలదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

శవదహనాలు, భారీ నిర్మాణాలను చేపట్టే సమయంలో సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎన్‌జీటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, 48 ప్రకారం వాతావరణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా పంచుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వాల మీదే ఉందని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తగు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు