వైదిక్ది రాజద్రోహమే.. చర్య తీసుకోండి: శివసేన

16 Jul, 2014 12:27 IST|Sakshi
వైదిక్ది రాజద్రోహమే.. చర్య తీసుకోండి: శివసేన

వేద్ ప్రతాప్ వైదిక్ వ్యవహారం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ను వైదిక్ కలవడం రాజద్రోహమేనని బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తమ అధికారిక పత్రిక సామ్నాలో వైదిక్ దేశభక్తుడు కారని, ఉగ్రవాదిని ఆయన కలవడం రాజద్రోహమని శివసేన వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడాన్ని కూడా విమర్శించింది.

అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎవరైనా పాత్రికేయుడు హఫీజ్ సయీద్ను గానీ, దావూద్ ఇబ్రహీంను గానీ కలిసుంటే బీజేపీ తప్పనిసరిగా ప్రభుత్వాన్ని విమర్శించి ఉండేదని సామ్నా సంపాదకీయంలో రాశారు. కానీ వాళ్లిప్పుడు అధికారంలో ఉన్నారని, అందుకే తమకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. ఈ విషయం జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి ఇందులో హిందూ ముస్లిం వివక్ష ఏమీ ఉండకూడదని, ఆ జర్నలిస్టును అలాగే వదిలేస్తే రేపు వెళ్లి దావూద్ ఇబ్రహీంతోను, టైగర్ మెమన్తోను, సయీద్తోను వెళ్లి బిర్యానీ తిని వస్తారని సామ్నాలో వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు