సర్వోన్నత న్యాయస్ధానం చరిత్రలో తొలిసారి..

11 May, 2020 18:19 IST|Sakshi

పెండింగ్‌ కేసుల పరిష్కారం దిశగా కీలక నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ : పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం నుంచి తొలిసారిగా నిర్ధిష్ట పిటిషన్‌లను ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సహజంగా సుప్రీంకోర్టు బెంచ్‌ కనీసం ఇద్దరు న్యాయమూర్తులతో కూడి ఉంటుంది. ఏడేళ్ల జైలు శిక్షకు మించని నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్‌, ముందస్తు బెయిల్‌ అప్పీళ్లను సింగిల్‌ జడ్జ్‌ బెంచ్‌ విచారిస్తుంది. బెయిల్‌, ముందస్తు బెయిల్‌, బదిలీ పిటిషన్ల విచారణకు సింగిల్‌ జడ్జ్‌ బెంచ్‌ను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు నిబంధనలను సవరించింది.

ఇక గత ఏడాది జులై వరకూ 11.5 లక్షల పెండింగ్‌ కేసులు పేరుకుపోయాయని న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో తక్షణం విచారణ చేపట్టాల్సిన కేసులను స్కైప్‌, ఫేస్‌టైం, వాట్సాప్‌ అప్లికేషన్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుప్రీంకోర్టు విచారిస్తోంది. కాగా, సంక్షోభ సమయంలో న్యాయస్ధానం పనిచేస్తూనే ఉందని, కేసుల పరిష్కారం దిశగా చొరవ చూపుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. తమ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏడాదికి 210 రోజులు పనిచేస్తామని ఆయన వెల్లడించారు. 

చదవండి : మద్యం అమ్మకాలకు నో.. సుప్రీంకు సర్కార్‌

మరిన్ని వార్తలు